Mrunal Thakur : టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతోంది. నిన్నటి దాకా బాలీవుడ్ కు చెందిన పూజా హెగ్డే టాప్ లో కొనసాగుతుండగా ఉన్నట్టుండి ఆమె ను తప్పించేశారు శాండిల్ వుడ్ కు చెందిన లవ్లీ గర్ల్ డాక్టర్ కోర్సు ఇంకా పూర్తి చేయని శ్రీ లీల. తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే గుంటూరు కారం రాబోతోంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాగా మహేష్ బాబు హీరో.
Mrunal Thakur Viral with Her Photos
శ్రీలీలకు పోటీగా వస్తోంది మరాఠా ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). తను తళుక్కున మెరిసింది సీతా రామం చిత్రంలో. దుల్కర్ సల్మాన్ తో లీనమై పోయి నటించింది. ఆకట్టుకునే సన్నివేశాలలో ఎలాంటి అసభ్యత అన్నది లేకుండా తీసిన ఈ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
తాజాగా మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం నానితో తీసిన హాయ్ నాన్న. ఇది తండ్రి, కూతురు, తల్లి మధ్య జరిగే బాండింగ్ పై దర్శకుడు ఫోకస్ పెట్టాడు. ఈ మూవీకి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటలు వైరల్ గా మారాయి. మొత్తంగా తను నవ్వుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో మృణాల్ మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు.
Also Read : Katrina Kaif : నిన్న రష్మిక నేడు కత్రీనా