Mrunal Thakur: సీతా మహాలక్ష్మీ అలియాస్ ప్రెన్సెస్ నూర్జహాన్ పాత్రతో ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ తరువాత నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ లో నటించి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ ముంబై బ్యూటీ… తొలిసారిగా కోలీవుడ్ లో అడుపెట్టబోతుందని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ సరసన నటించడానికి ఈ మరాఠీ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రమేశ్ వర్మ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైందట. ఈ సినిమాకు ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్ ను పరిశీస్తున్నారని… ఇది మరో ‘సీతారామం’ లా ఉంటుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
Mrunal Thakur Movie Updates
దీనితో పాటు ఆరు సినిమాల్లో నటించడానికి మృణాల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తోంది. అలాగే చిరంజీవి – వశిష్ఠ కలయికలో రూపొందనున్న ‘విశ్వంభర’ లో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు కాకుండా శివ కార్తికేయన్‌తో ‘అయలాన్’ చిత్రం తెరకెక్కించిన రవికుమార్ నెక్ట్స్ సినిమా రాఘవ లారెన్స్ తో కూడా ఈమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అరడజను వరకు సినిమాల్లో మృణాల్ త్వరలో కనిపించబోతుందన్న మాట.
1992లో మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో జన్మించిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)… టెలివిజన్ నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి… ‘విట్టిదండు’ అనే సినిమా ద్వారా తొలిసారి మరాఠీ భాషలో అడుగుపెట్టింది. ఆ తరువాత హిందీలోని పలు సినిమాల్లో నటించిన ఈ మరాఠీ బ్యూటీ… హానురావిపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కించిన ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇటీవల నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ లో నటించి యువతలో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది.
Also Read : Chinmayi Sripada : నన్ను వెదించిన వారికీ సన్మానాల..?