Mrunal Thakur : ముంబైకి చెందిన మరాఠీ భామ , ముద్దుల గుమ్మ మృణాల్ ఠాకూర్ ఈ మధ్యన తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం తను గతంలో నటించిన సినిమాల కంటే టాలీవుడ్ లో నటించిన సీతా రామం సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సులు బద్దలు కొట్టక పోయినా ఈ మూవీ ఆమెను గుర్తు పెట్టుకునేలా చేసింది. దీనిని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ నిర్మించాడు.
Mrunal Thakur Comment
గతంలో బాట్లా హౌస్ , ఘోస్ట్ స్టోరీస్ చిత్రాలలో నటించింది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). దుబాయ్ లో జరిగిన పురస్కారాల ఈవెంట్ లో తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్బంగా ప్రముఖ సక్సెస్ ఫుల్ నిర్మాత, నటుడు బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోవాలని, భర్త దొరకడం ఖాయమని, హైదరాబాద్ లోనే స్థిర పడాలని కోరాడు. దీంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుందని టాక్. అయితే దీనిని కొట్టి పారేసింది మృణాల్ ఠాకూర్.
ఇదిలా ఉండగా తాజాగా నానితో కలిసి హాయ్ నాన్న చిత్రంలో నటించింది. ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుంది ఈ లవ్లీ గర్ల్. విచిత్రం ఏమిటంటే తండ్రి సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీలో ఉన్నట్టుండి కిస్ సీన్ పెట్టడం ఒకింత విచత్రంగా అనిపిస్తోంది.
Also Read : Ira Khan Pre Wedding : పెళ్లి వేడుకల్లో ఇరా ఖాన్ బిజీ