Mrunal Thakur : “సీతారామం” సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అచ్చమైన తెలుగు అబ్బాయిని మృణాల్ పెళ్ళాడబోతుందంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. ఇటీవల పలు వెబ్ సైట్లలో తన పెళ్ళిపై వస్తున్న వార్తలపై మృణాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేకు ఓ వీడియోను పోస్ట్ చేసింది.
Mrunal Thakur – వీడియోలో మృణాల్ ఏం చెప్పిందంటే…
‘‘నా స్నేహితులు, స్టైలిస్ట్ డిజైనర్స్, బంధువులు వరుసగా ఫోన్‌కాల్స్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఎవరో నాకూ తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. త్వరలోనే పెళ్లవుతుంది. అయితే.. వరుడిని మీరే వెతికిపెట్టి నాకు చెప్పండి. కల్యాణ వేదిక, ఆ లోకేషన్ వివరాలు కూడా పంపండి. సరేనా?’’ అని వీడియోలో వ్యాఖ్యానించింది. దీనితో ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
అసలు మృణాల్ పెళ్ళిపై ఎందుకు అంత ఆశక్తి…
దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా 2023 అవార్డుల ప్రదానోత్సవంలో ‘సీతారామం’ చిత్రానికిగానూ మృణాల్(Mrunal Thakur) ఉత్తమ నటి (క్రిటిక్స్) విభాగంలో అవార్డు అందుకున్నారు. అవార్డు ప్రధానం అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘సీత పాత్రకు నేను సరిపోతానని టీమ్ బాగా నమ్మింది. అచ్చ తెలుగింటి అమ్మాయిలా నన్ను తీర్చిదిద్దారు. ఈ సినిమా షూట్ మొదలైన నాటి నుంచి హైదరాబాద్‌ని మా ఇంటిలా ఫీలయ్యా. ముంబయికి వెళ్లాలనిపించేది కాదు. దీనితో ‘మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా?’ అని ముంబయి నిర్మాతలు చాలా మంది అడిగేవారు. నాకు మాత్రం హైదరాబాద్‌కు వచ్చేయాలని ఉంది’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనితో ఆమెకు అవార్డు అందజేసిన అనంతరం అరవింద్ మాట్లాడుతూ.. ‘‘గతంలో నేనొక ఈవెంట్‌లో హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింటికి కోడలిగా రమ్మని ఓ హీరోయిన్ (లావణ్య త్రిపాఠి)కి బ్లెస్సింగ్స్ ఇచ్చా. తెలుగు హీరోతో ఆమె ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా’’ అని నవ్వుతూ చెప్పారు. దీనితో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సంబంధిత విజువల్స్ కొన్ని రోజుల క్రితం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మృణాల్ తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతోందంటూ పలు వెబ్‌సైట్లలో ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా వాటిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు.
Also Read : Waltair Veerayya: చెత్త రికార్డు