ఒక్క సినిమా చాలు సక్సెస్ కావడానికి. ఇదే ఇప్పుడు మరాఠాకు చెందిన మృణాల్ ఠాకూర్ కు వర్తిస్తుంది. అశ్వనీదత్ తీసిన సీతా రామం ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అవార్డులు కూడా వరించాయి. కథ బాగుంటే సినిమా తప్పక ఆడుతుందని ఇప్పుడు అర్థమవుతోంది నిర్మాతలకు. గతంలో స్టార్లు ఉంటే ఆడేవి..ప్రేక్షకులు కూడా ఆదరించే వారు. కానీ సీన్ మారింది. ఇప్పుడు డోంట్ కేర్ అంటున్నారు. విడుదలైన ఫస్ట్ షోనే కన్ ఫర్మ్ చేస్తున్నారు ఇది సక్సెస్ లేదా అన్నది.
కొందరు నటీ నటులు పనిగట్టుకుని తమ సినిమాలను తామే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. కానీ సౌత్ ఇండియాను ఏలుతున్న 40 ఏళ్ల నయన తార మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఆమె ముందే సంతకం చేయించుకుంటుంది. తాను ఏ ప్రమోషన్ కు అటెండ్ అవనని.
ఇన్నేళ్ల వయస్సు వచ్చినా తనలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదంటోంది నయన్. తాజాగా చెప్పుకోవాల్సిన నటి మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఇప్పుడు నానితో నటించిన హాయ్ నాన్నపైనే ఉన్నాయి. మలయాళ సినీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు.
ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ చేసేశాడు. పాటలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే కథతో సంబంధం లేక పోయినా ఓ కిస్ సీన్ పెట్టడం ఒకింత ఎబ్బెట్టుగా అనిపించింది.