Mrunal Thakur: ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. కానీ ఇటీవల ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీనితో కాస్తా నిరాశలో ఉన్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు ఊహించని అవకాశం కాళ్ళ దగ్గరికి వచ్చింది. దేవదాస్, పద్మావతి, గంగూభాయ్ కతివాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి ఎన్నో వాస్తవిక కథలను కళ్ళకు కట్టినట్లు చూపించిన భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనితో భన్సాలీ సినిమాలో అవకాశం రావడంపై ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Mrunal Thakur New Movie
ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ‘మామ్’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన రవి ఉద్యావర్ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. సిద్ధాంత్ చతుర్వేది కథానాయకుడిగా కనిపించనున్నారు. ఇదొక భిన్నమైన రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కనుందని… ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని తెలుస్తోంది. అంతేకాదు దీనికి భన్సాలీ స్వయంగా సంగీతమందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి చిత్రీకరణని ప్రారంభించు కోనున్నట్లు బీ టౌన్ వర్గాల సమాచారం.
Also Read : Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్ ప్రయాణానికి అరవై ఏళ్ళు పూర్తి !