Mrunal Thakur: టాలీవుడ్ లో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ అనే రెండు సినిమాల్లో నటించి… పది సినిమాలకు సరిపడ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి… బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ మరాఠీ భామ ఇప్పుడు ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోనే అంధేరీ ప్రాంతంలో ప్రముఖ నటి, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు దగ్గరి బంధువుల వద్ద ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు టాక్. కంగనా రనౌత్ తండ్రి సోదరుడు అంటే చిన్నాన్న లేదా పెదనాన్న వద్ద మృణాల్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు బీ టౌన్ వర్గాల సమాచారం.
Mrunal Thakur New Flat
అయితే ఈ ఫ్లాట్ ఎంతకు కొన్నది అనే విషయాలను ఈమె వెల్లడించకపోయినప్పటికీ… ఆ ప్రాంతంలో ఉన్న డిమాండ్ బట్టి… దాని విలువు నాలుగు కోట్లు పైనే ఉంటుందని టాక్. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అని పెద్దలు చెప్పిన మాటను తూచ తప్పకుండా అనుసరిస్తున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ముంబయికి చెందిన మృణాల్ ఠాకుర్… సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్‌లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది. అయితే హిందీలో ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపు దక్కకపోవడంతో… 2022లో ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో… సౌత్‌లో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటీవల నేచురల్ స్టార్ నానితో నటించిన హాయ్ నాన్న కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయడంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం మృణాల్ ఆచితూచి సినిమాలకు ఓకే చెప్తోంది.
Also Read : Babu No1 Bullshit Guy : వైరల్ అవుతున్న ‘బాబు నెం1 బుల్ షిట్ గయ్’ ట్రైలర్