Sonakshi Sinha: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకు సీక్వెల్ గా హిందీలో తెరకెక్కించిన సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్’. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా(Sonakshi Sinha), సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిచారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ సరసన సోనాక్షీ సిన్హా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో నవ్వులు పంచిన అజయ్ దేవగణ్, సంజయ్ దత్ లు దాని సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్‌లుగా కనిపించనున్నారు. అయితే తొలి భాగానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. వీరిద్దరి మధ్య పోటీ మరింత తీవ్రంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త సంగతి తెలిసింది.
Sonakshi Sinha….
ఇటీవలే ‘కల్కి’లో తళుక్కున మెరిసి, ప్రశంసలు అందుకుంటోన్న అందాల తార మృణాల్ ఠాకూర్‌ని ఇందులో కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ఈ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్లో నటించడానికి మృణాల్ చాలా ఉత్సాహంగా ఉంది. ఈనెల ఆఖర్లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మృణాల్, అజయ్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ పాటలు, సన్నివేశాలను స్కాట్లాండ్లో చిత్రీకరించనున్నాం. వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’తో బిజీగా ఉన్నారు అజయ్ దేవగణ్. సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Also Read : Salman Khan: అట్లీ దర్శకత్వంలో కమల్ – సల్మాన్ సినిమా !