Mr Bachchan Producer : మిస్టర్ బచ్చన్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

తాజాగా పప్రొడ్యూసర్ టీ.జి.విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ....

Hello Telugu - Mr Bachchan Producer

Mr Bachchan : ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బోర్లా ప‌డిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో మాస్ మ‌హారాజ రవితేజ , భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీ.జి.విశ్వప్రసాద్‌(TG Viswa Prasad) నిర్మించారు. 2018లో అజ‌య్ దేవ‌వ్‌గ‌ణ్ హీరోగా హిందీలో సూప‌ర్ హిట్ అయిన రైడ్ చిత్రాన్ని కాస్త మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేశారు. తాజాగా ఈ సినిమాపై ప్రొడ్యూసర్ టీ.జి.విశ్వప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Mr Bachchan Comments

తాజాగా పప్రొడ్యూసర్ టీ.జి.విశ్వప్రసాద్‌(TG Viswa Prasad) మాట్లాడుతూ.. “మిస్టర్‌ బచ్చన్‌ తన జీవితంలో తీసుకున్న వరస్ట్ డెసిషన్” అన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ.. “80ల నాటి హిందీ పాటలు నాకు నచ్చి సినిమా ఆడేస్తుందనున్నాను. అదొక తప్పు అయితే, ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, కొన్ని ఎపిసోడ్స్ ను చాలా ఫాస్ట్ గా తీసేశాం. సినిమాలో 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్ గా తీసుంటే హిట్టయ్యేది. కీలకమైన ఆ ఎపిసోడ్స్ మేం ఫాస్ట్ గా తీశాం. అలా రైడ్ సీన్స్ ఎగ్జిక్యూట్ చేయడంతో సినిమా మిస్ ఫైర్ అయింది. ప్రాజెక్టులో ఆఖరి నిమిషంలో అడుగుపెట్టడం కూడా తను చేసిన తప్పన్నారు” విశ్వప్రసాద్.

ఇకఈ సినిమా ట్రోలింగ్స్ పై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ నాకు కొత్తేమీ కాదు. అలానే సోషల్‌ మీడియా మాత్రమే నా జీవితం కాదు. నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా..పిడుగు వచ్చినా ఇలానే ఉంటా(గబ్బర్‌సింగ్‌లో డైలాగ్‌ ). నా వ్యక్తిత్వం అలాంటిది’’ అన్నారు.‘గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వచ్చిన స్పందనలు నన్ను నిరాశపరిచాయి. కానీ, ఆ దర్శకుల మీద లేని అటాక్‌ నాపై జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్‌ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు.

ఇందులోనిఒక డ్యాన్స్‌ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకుని విమర్శిస్తున్నారు. కానీ, ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. ‘కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్‌ చేసి చెప్పారు. అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ఏ విషయంలోనైనా ‘నో’ చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశాను. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.

Also Read : Dil Raju : మరో కొత్త బ్యానర్ స్థాపించిన అగ్ర నిర్మాత ‘దిల్ రాజు’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com