Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్నతాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా, మాస్ మేకర్ మాస్ రీయూనియన్ మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అద్భుతమైన ప్రొడక్షన్ టీం, సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘మిస్టర్ బచ్చన్’పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Mr Bachchan Movie Updates
ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా విడుదల చేసిన షోరీల్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా… తాజాగా మేకర్స్ ‘మిస్టర్ బచ్చన్(Mr Bachchan)’ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘సితార్’ సాంగ్ జులై 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ఓ ప్రోమో వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్స్‌గా అలరించాయి. ‘మిరపకాయ్’ ఆడియో అయితే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘మిస్టర్ బచ్చన్’ ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా అదే హింట్ ఇచ్చింది.
Also Read : Bangaru Bomma: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై ‘బంగారు బొమ్మ’ సందడి !