Vijayasai Reddy : అమరావతి – వైఎస్సార్సీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు తన అనుంగు అనుచరుడిగా పేరు పొందిన, అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి(Vijayasai Reddy). శుక్రవారం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంపీ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
MP Vijayasai Reddy Exit From..
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవని అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఇందులో ఒకరి ప్రమేయం ఉంటుందని అనుకోవడం తప్పన్నారు. తాను ఏది చేసినా ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం పని చేశానని చెప్పారు.
జనవరి 25న తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలతో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు. తామిద్దరం మంచి మిత్రులమన్నారు. ఈ విషయం జగన్ రెడ్డికి కూడా తెలియ చేశానని అన్నారు. ఇదిలా ఉండగా ఆయన ప్రస్థానం ఆడిటర్ గా మొదలై రాజకీయాల్లో అనూహ్యంగా తప్పుకునేంత దాకా వెళ్లడం విశేషం.
Also Read : Beauty Payal Rajput Movie : పాయల్ రాజ్ పుత్ ‘వెంకటలచ్చిమి’ మూవీ స్టార్ట్