Movie Taxes : టికెట్ కొనుగోలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పై పన్ను విధించిన ఆ రాష్ట్ర సర్కార్

వీటిపై 1 నుంచి 2 శాతం సెస్‌ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది...

Hello Telugu - Movie Taxes

Movie Taxes : సినీ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌పై పన్ను విధించనుంది. అవును, కర్ణాటక(Karnataka) ప్రభుత్వం సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై 2శాతం సెస్‌ వసూలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్‌ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది.

Movie Taxes….

వీటిపై 1 నుంచి 2 శాతం సెస్‌ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి ఈ సెస్‌ రేటును సమీక్షించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాలపైనా ఈ సెస్‌ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి మహమ్మద్‌ మోహ్‌సిన్‌ వెల్లడించారు. ఈ పన్నును ఎలా వసూలు చేయాలన్న దానిపై ప్రస్తుతం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక, సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో ప్రస్తావించారు. సెస్‌ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారట. దీంతో పాటు ఆర్టిస్టుల ఆర్థిక భద్రత కోసం ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సర్కారు భావిస్తోంది.

Also Read : Saniya Iyappan: మేగజైన్ ఫోటో షూట్ చేసిన మలయాళ బ్యూటీను ట్రాన్స్‌ జెండర్‌ లా ఉందంటూ ట్రోల్స్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com