Kalyan Shankar : కథలో ఎంత దమ్ముంటే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేందుకు రెడీ అవుతారు. తాజాగా దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) సంచలన కామెంట్స్ చేశాడు. తాను గతంలో తీసిన మ్యాడ్ ప్రేక్షకులను పిచ్చివాళ్లను చేసింది. థియేటర్లకు రప్పించేలా చేసింది. బిగ్ సక్సెస్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండానే ముందుకు వచ్చింది. ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంది. కాసుల వర్షం కురిపించింది.
Kalyan Shankar Shocking Comments
మ్యాడ్ బిగ్ సక్సెస్ కావడతో తాజాగా మ్యాడ్ కు సీక్వెల్ గా మ్యాడ్ 2 తీసుకు వచ్చాడు. ఈ సందర్బంగా ఆసక్తికరంగా కామెంట్ చేశాడు కళ్యాణ్ శంకర్. నార్నే నితిన్, సంగీత్ శోభన్ , రామ్ నితిన్ , విష్ణు గతంలో నవ్వులు పూయించారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడం పక్కా అని పేర్కొన్నాడు దర్శకుడు.
ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ కావడం పక్కా అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు విడుదలై సినీ , సంగీత ప్రేమికులను అలరించాయి. అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈవెంట్ లో దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ ..మీరు పెట్టే ప్రతి పైసాకు నాది గ్యారెంటీ. అంతకు మించి ఆనందాన్ని పొందుతారు. హాయిగా నవ్వుకుంటారు. అంతకు మించిన కామెడీ చవి చూస్తారంటూ తెలిపాడు. అందుకే ఛాలెంజ్ చేస్తున్నా మీరు నవ్వు కోవడం ఖాయమన్నాడు. కాదంటే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానంటూ ప్రకటించాడు.
Also Read : Madha Gaja Raja Success :మదగజరాజా సక్సెస్ విశాల్ ఖుష్