Mokshagna Tej : నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేదెప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెర దించేస్తూ వస్తున్నా అంటూ తీపికబురు చెప్పారు నందమూరి వారసుడు. ఈయన మేకోవర్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ(Mokshagna Tej) ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది. బాలయ్య ఎక్కడికి వచ్చినా.. ఆయన సినిమా కంటే ముందు వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తున్నారనే ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాలయ్య వారసుడి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతా బానే ఉంది గానీ వారసుడిని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది.
Mokshagna Tej Movie Updates
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని తెలుస్తుంది. గతంలో బాలయ్యతో అన్‌స్టాపబుల్‌కు పనిచేసారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. పైగా హనుమాన్‌తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మోక్షు కోసం రాసిన కథ కూడా మైథాలజి టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా అని తెలుస్తుంది. కల్కి మాదిరే భారీగా ఉండబోతుంది ఈ చిత్రం. ఇందులో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఏదైమైనా కథ ఎలాగున్నా.. ఈ ఏడాది మోక్షు ఎంట్రీ మాత్రం ఖాయం. సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Also Read : Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక కు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్..