Mokshagna Tej : ఎట్టకేలకు నందమూరి నటసింహం వారసుడు రంగంలోకి దిగిపోయాడు. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఙ మొదటి సినిమాకు రంగం సిద్ధమైంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ప్రశాంత్ వర్మ.. మోక్షు మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య తనయుడి బర్త్ డే సందర్భంగా మోక్షు సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయాడు. సూపర్ స్టైలిష్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో మోక్షు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదుర చూస్తున్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ(Mokshagna Tej) కొంచెం బొద్దుగా ఉండేవాడు. ఈ కారణంగానే బాలయ్య తనయుడు సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే సందేహాలు కూడా వెలువడ్డాయి. అయితే వీటన్నిటినీ పటా పంచలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మోక్షజ్ఞ. ఒక హీరోకు ఉండాల్సిన పర్‌ఫెక్ట్ కటౌట్ తో ఎంట్రీ ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Mokshagna Tej Workout..
కాగా బొద్దుగా ఉన్న మోక్షు.. హీరో కటౌట్‌లోకి రావడానికి ఎంత వెయిట్ లాస్ అయ్యాడో తెలుసా? దాదాపు 18 కేజీలు. హీరోగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత మోక్షజ్ఞ ఫిట్‌నెస్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. కేవలం ఐదారు నెలల్లోనే తన బరువును తగ్గించుకున్నాడట. కాగా 30 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ, ఫస్ట్ సినిమానే సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదే సినిమాతో బాలయ్య రెండో కూతురు తేజస్విని కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోండడం విశేషం.
Also Read : Ranveer-Deepika : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే