L2 Empuraan : మలయాళ సినీ రంగంలో టాప్ హీరో మోహన్ లాల్. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసే నటుడు. అందుకే తనంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఆయన దర్శకులకు ఇష్టమైన నటుడు. తాజాగా తను నటించిన ఎల్ 2 – ఎంపురాన్ సీక్వెల్ మూవీ రిలీజ్ కాకుండానే రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా ప్రీ సేల్స్ లో సంచలనం రేపింది. రూ. 58 కోట్లు బిజినెస్ చేసింది. సినీ వర్గాలను విస్మయ పరిచింది. ఇందులో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ చౌహాన్ కీ రోల్స్ చేశారు.
L2 Empuraan Top Business Before Release
తాజా అప్ డేట్ ప్రకారం ఎంపురాన్(L2 Empuraan) బుకింగ్స్ లో దూసుకు పోతోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల మైలు రాయిని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దీనిని సుకుమారన్ తీశాడు. ఇది భారీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో వాణిజ్య పరంగా మలయాళ సినిమాకు ఊపిరి పోసిందని చెప్పక తప్పదు. మార్చి 27న గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఎల్ 2 ఎంపురాన్.
ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ గా మార బోతోందని అంటున్నారు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన క్రిటిక్స్. కేరళలో ప్రత్యేకించి ఈ మూవీ చార్టులలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రారంభం రోజునే రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. తొలి రోజు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రూ. 40 నుంచి రూ. 50 కోట్ల మధ్యన ఉండ బోతోందని అంటున్నారు.
త్రిస్సూర్ లోని రాగం థియేటర్ లో నాలుగు రోజులకు సంబంధించి టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయని శ్రీధర్ పిల్లై వెళ్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవలే మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన మలైకొట్టై వాలిబన్ , బారోజ్ సినిమాలు ఆశించిన మేర ఆడలేదు. ఉన్నట్టుండి ఎల్ 2 ఎంపురాన్ మాత్రం తనకు ప్రత్యేకంగా తీపి గుర్తుగా ఉండి పోతుందని చెప్పక తప్పదు.
Also Read : Hero Chiranjeevi-Vishwambhara :మెగాస్టార్ విశ్వంభరపై ఓటీటీలు ఫోకస్