Mohanlal : ‘మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ కు మోహన్ లాల్ రాజీనామా..

'మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' కు మోహన్ లాల్ రాజీనామా....

Hello Telugu - Mohanlal

Mohanlal : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు.

Mohanlal Resign…

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ కొన్నేళ్లపాటు శ్రమించి ఒక నివేదిక రూపొందించింది. ఇందులో ఎన్నో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హేమ కమిటీ రూపొందించిన నివేదిక అంతటా చర్చకు దారితీసింది.

Also Read : Prabhutva Juniour Kalasala: ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com