Mohanlal Health : ఆసుపత్రిలో చేరిన మలయాళ హీరో మోహన్ లాల్

మోహన్ లాల్ ప్రస్తుతం ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు...

Hello Telugu - Mohanlal Health

Mohanlal : మలయాళీ హీరో మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులే స్వయంగా వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే కాకుండా పూర్తిగా కోలుకునే వరకు 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రద్దీ ప్రదేశాలతోపాటు షూటింగ్స్ కు కొన్నిరోజులపాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ చెబుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మోహన్ లాల్ కోలుకుంటున్నారని మెడికల్ బులెటిన్ పేర్కొంది. మోహన్‌లాల్(Mohanlal) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు మోహన్‌లాల్‌ ఆసుపత్రిలో చేరడంపై పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

Mohanlal Health Condition..

మోహన్ లాల్ ప్రస్తుతం ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించగా.. బరోసిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మోహన్ లాల్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించారు. నటుడికి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిపారు.

Also Read : 12th Fail: మరోసారి సత్తా చాటిన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com