Mohan Babu : మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో వీరిద్దరి మధ్య దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారని మనోజ్(Manoj) ఫిర్యాదు చేస్తే.. తనపై కొడుకు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు(Mohan Babu) ఫిర్యాదు చేసినట్లుగా టాక్ వినబడుతోంది. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో వీరిరువురు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని.. తనతో పాటు తన భార్యపై కూడా తండ్రి మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదులతో మరోసారి మంచు ఫ్యామిలీ వార్తలలో హైలెట్ అవుతోంది.
Mohan Babu-Manoj..
అయితే ఈ దాడి, ఫిర్యాదులలో నిజం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలే అంటూ మరో వార్త వైరల్ అవుతోంది. ‘‘మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కథనాలన్నీ అసత్య ప్రచారాలే. వాటిలో నిజం లేదు. ఎవిడెన్స్‌లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’’ అంటూ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
మంచు మనోజ్ పైన మంచు మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు అనుచరుడు వినయ్‌పై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల విషయంపైనే దాడులు జరిగాయని, విద్యానికేతన్ సంస్థలో మోహన్ బాబు అనుచరుడు వినయ్ కీలక పదవిలో ఉన్నారని తెలుస్తోంది. వినయ్ కొంతమందితో కలిసి మనోజ్‌పై దాడి చేశాడనేలా మరోవైపు టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై మంచు మనోజ్ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల వ్యవహారంలో నాపై దాడి జరిగింది. నా తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారు. ఖచ్చితంగా ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపినట్లుగా తాజా సమాచారం.
ఇంతకుముందు కూడా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ ఇదే విధంగా మీడియాకు ఎక్కారు. వారిద్దరూ కోట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. మంచు మనోజ్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే అదేం లేదని, ఒక షో కోసమే ఇదంతా చేశామని ఆ తర్వాత కవర్ చేశారు కానీ.. ఆ ఘటనతోనే వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయనేలా వార్తలు బయటి ప్రపంచానికి తెలిశాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మంచు విష్ణు తీరు వార్తలలో హైలెట్ అయ్యింది. మొత్తంగా అయితే వారు ఏం లేదని చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం ఏదో జరుగుతుందనేలా తెలియజేస్తుండటం గమనార్హం. మరి ఇప్పుడు వినిపిస్తున్న వార్తలపై మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
Also Read : RC16 Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ సి 16’ మూవీ నుంచి కీలక అప్డేట్