Ajith Kumar : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యున్నతమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. దక్షిణాది నుంచి నలుగురిని ఎంపిక చేసింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అజిత్ కుమార్(Ajith Kumar) ను ఎంపిక చేసింది. టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ, మలయాళ సినీ రంగానికి సంబంధించి నటి శోభన, శాండిల్ వుడ్ కు సంబంధించి అనంత్ నాగ్ ను ఎంపిక చేసింది.
Ajith Kumar Padma Award
ఇక బాలయ్య నందమూరి వారసుడిగా గుర్తింపు పొందారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు. ఇటీవలే తను నటించిన డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తను చేస్తున్న అన్ స్టాపబుల్ షో టాప్ లో కొనసాగుతోంది.
ఇక తమిళ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి అజిత్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత స్వంతం చేసుకున్న అరుదైన నటుడు అజిత్ కుమార్. తను నటి షాలినిని పెళ్లి చేసుకున్నాడు . తనకు రేస్ కార్లంటే తెగ మోజు. ఈ మధ్యనే దుబాయ్ వేదికగా కార్ రేస్ లో పాల్గొన్నాడు. టాప్ త్రీలో నిలిచాడు కూడా. సినిమా రంగంలో కొన్నేళ్లుగా ఉంటూ విశిష్ట సేవలు అందించినందుకు గాను అజిత్ కుమార్ కు పద్మ అవార్డును ప్రకటించినట్లు తెలిపింది కేంద్ర సర్కార్.
Also Read : Beauty Keerthy-Antony : బ్యూటిఫుల్ కపుల్ వైరల్