A M Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తను ప్రస్తుతం హరి హర వీర మల్లు మూవీలో నటిస్తున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ తో పాటు పూజిత పొన్నాడ కూడా నటిస్తోంది. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం(A M Rathnam) నిర్మిస్తుండడం విశేషం. తన పుట్టిన రోజు సందర్బంగా చిట్ చాట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక వెనుదిరిగి చూడరని అన్నారు.
A M Rathnam Comments Viral
పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాడని, ప్రస్తుతం సినిమాను పూర్తి చేయాలన్న కసితో పని చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చాడు రత్నం. ఇప్పటికే చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ , ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట దుమ్ము రేపుతోందన్నాడు. హరి హర వీరమల్లు మూవీ సినీ చరిత్రలో ఓ మైలు రాయి కాబోతోందన్నారు. అంత అత్యద్బుతంగా ఇందులో నటించాడంటూ ప్రశంసించాడు.
ఇదిలా ఉండగా ఎంఎం రత్నం నిర్మాతనే కాదు. తను మంచి రచయిత, గేయ రచయిత, దర్శకుడు కూడా. తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేశాడు. విజయశాంతితో కర్తవ్యం నిర్మించాడు. ఇక పెద్దరికం, సంకల్పం సక్సెస్ అయిన మూవీస్ కు తను దర్శకత్వం వహించాడు.
ఖుషి, గిల్లి, రెయిన్ బో కాలనీ, ఇండియన్, కథలర్ దినం, బాయ్స్ సినిమాలు నిర్మించాడు. పలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన చరిత్ర ఎంఎం రత్నంది. ఇక రాబోయే హరి హర వీరమల్లు మూవీ సక్సెస్ కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read : Pujita Ponnada- Stunning :పూజిత పొన్నాడ నెట్టింట్లో వైరల్