MM Keeravani : ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణికి(MM Keeravani) అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాను పురస్కారం దక్కింది. ఆయన పూర్తి పేరు కోడూరు మరకతమణి కీరవాణి .
జూలై 4, 1961లో పుట్టారు. ఆయన వయసు 62 ఏళ్లు. తెలుగు సినీ వెండితెర మీద తనదైన సంగీతం అందించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడు, రచయిత కూడా. తమిళంలో మరకతమణిగా హిందీలో ఎంఎం క్రీమ్ గా గుర్తింపు పొందాడు.
MM Keeravani Feels Peoud
రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పని చేశాడు. 1989లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత తెలుగు చిత్రానికి పరిచయం అయ్యాడు. ఆనాటి నుండి నేటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలకు సంగీతం అందించాడు. 1997లో అన్నమయ్య చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు.
సీతారామయ్య గారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ , అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నెంబర్ 1 , ఛత్రపతి, సింహాద్రి , అనుకోకుండా ఒకరోజు , ఆపద్భాంధవుడు , శుభ సంకల్పం, పెళ్లి సందడి, సుందరకాండ, బాహు బలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు గుర్తింపు పొందాయి.
కీరవాణి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు సంగీతం వహించడం విశేషం. ఇక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకు ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్నారు కీరవాణి.
Also Read : Sardar Udham : అద్భుత చిత్రం దక్కిన పురస్కారం