Mithun Ramesh: ప్రముఖ మలయాళం నటుడు, టెలివిజన్ ప్రెజెంటేర్ మిథున్ రమేష్… కొంతకాలం క్రితం అరుదైన వ్యాధి బెల్స్ పాల్సీ బారిన పడ్డారు. దీనినే ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. ఫేషియల్ పెరాలసిస్ అంటే ముఖంలో ఒకవైపు కండరాలు సరిగ్గా పనిచేకపోవడం వల్ల పక్షవాతం ఏర్పడి ముకం వంకరగా కనిపిస్తుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. దీనితో మిథున్(Mithun Ramesh) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అతని భార్య లక్ష్మి… మిథున్ కు త్వరగా నయం అయితే నీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని ఆమె తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది.
Mithun Ramesh – మొక్కు ప్రకారం భర్త కోసం గుండు గీయించుకున్న లక్ష్మి
బెల్స్ పాల్సీ నుండి దాదాపు బయటపడటంతో… కుటుంబ సమేతంగా మిథన్ ఇటీవల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీనితో మొక్కు ప్రకారం అతని భార్య లక్ష్మి… వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనితో భర్త ఆరోగ్యం కోసం లక్ష్మి గుండు గీయించుకోవడంపై మిథున్ తో పాటు అతని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఎమోషనల్ అయిన మిథున్
‘బెల్స్ పాల్సీ వ్యాధి వల్ల నేను ఎంత ఇబ్బందిపడ్డానో మీకు తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. నా భార్య అయితే ఆ భగవంతుడిని ప్రార్థించని రోజంటూ లేదు. ఈ వ్యాధి నుంచి బయటపడితే తలనీలాలు ఇస్తానని తిరుపతి దేవుడికి మొక్కుకుంది. ఇదిగో ఇప్పుడు ఆమె ఆ మొక్కు తీర్చుకుంది. ఇంతకంటే ఆమెను నేను ఏమని అడిగాలి. ఇంతటి ప్రేమ, త్యాగం, నమ్మకం చూపిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. మిథున్ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ లక్ష్మిను ప్రశంసిస్తున్నారు.
Also Read : Ashika Ranganath: ‘నా సామిరంగ’ హీరోయిన్.. లుక్ మామూలుగా లేదుగా