Miss Shetty Mr Polishetty : తాజాగా విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం శుభ పరిణామం అని చెప్పక తప్పదు. సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ సూపర్ డూపర్ గా నిలిచింది. ఇక అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార కలిసి నటించిన జవాన్ గురవారం విడుదలై అలరిస్తోంది.
Miss Shetty Mr Polishetty Positive Talk
ఇదే సమయంలో టాలీవుడ్ కు చెందిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) మూవీ రిలీజై సక్సెస్ బాట పట్టింది. జాతి రత్నాలు మూవీతో టాప్ లోకి దూసుకు వచ్చిన నటుడు నవీన్ పొలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి కలిసి నటించారు ఈ చిత్రంలో.
ఆద్యంతం నవ్వులు పండించేలా చేసిందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. దర్శకుడు నవ్వించడంలో సక్సెస్ అయ్యాడని కితాబు ఇస్తున్నారు. గతంలో వచ్చిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఉందని చెబుతున్నారు.
మొత్తంగా నవీన్ , అనుష్కకు ఇది గుడ్ న్యూస్ . వైవిద్యం , హాస్యం , ప్రేమ కు ప్రయారిటీ ఇస్తూ దర్శకుడు మహేష్ బాబు తీశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్, అనుష్కతో పాటు మురళీ శర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా ఇతర పాత్రలో నటించారు.
Also Read : Jawan Super : బాద్ షా సూపర్ జవాన్ కిర్రాక్