మహేష్ బాబు .పి దర్శకత్వంలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బిగ్ సక్సెస్ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఆశించిన దాని కంటే ఎక్కువగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
ఇందులో జాతి రత్నాలు చిత్రంలో లైమ్ లైట్ లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. ఇక దక్షిణాదిన ఎదురే లేని ధ్రువతారగా పేరు పొందిన అనుష్క శెట్టి ఇందులో కీలక పాత్ర పోషించింది.
ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లతో దూసుకు పోతోంది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇవాళ కీలక ప్రకటన చేసింది.
ఇక థియేటర్లలో చూడలేని వాళ్లు, ఓటీటీలో చూడాలని అనుకునే వాళ్లకు తీపి కబురు చెప్పింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 5 నుంచి తమ మాధ్యమం ద్వారా స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేసింది. మొత్తంగా దర్శకుడి పనితీరుకు అద్దం పట్టింది ఈ సినిమా. కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా హీరో, హీరోయిన్ల కంటే కథలో కొత్తదనం, నిజాయితీ , భిన్నంగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు మహేష్ బాబు పి.