కంటెంట్ ఉంటే హీరో, హీరోయిన్లు లేక పోయినా సినిమా నడుస్తుంది అని చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఓ వైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ దూసుకు పోతున్నా దాని హవాను తట్టుకుని నిలబడింది. ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా తీశాడు దర్శకుడు మహేష్ బాబు.
జాతి రత్నాలు చిత్రంతో హీరోగా జనానికి పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంతో మరోసారి తనలో సత్తా ఉందని చాటాడు. స్టాండప్ కమెడియన్ గా ఇందులో నటించాడు. ఇక చెఫ్ పాత్రలో సీనియర్ నటి అనుష్క శెట్టి నటించింది. వీరిద్దరూ కలిసి ఒకరి కంటే మరొకరు పోటీ పడి నటించారు..ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తక్కువ పెట్టుబడితో తీసిన ఈ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ. 50 కోట్ల వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా. ఇది ఊహించని సంతోషాన్ని కలిగించేలా చేసింది. ఈ మధ్యనే దర్శకుడు మహేష్ బాబు మాట్లాడుతూ కథలో కొత్తదనం, దమ్ము ఉంటే జనం ఆదరిస్తారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రస్తుతం సినిమా విడుదలైనా ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని చోట్లా జేజేలు పలుకుతున్నారు.