Ministry of Broadcasting : ఢిల్లీ – కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Ministry of Broadcasting) సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు కీలక సూచనలు చేసింది. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించింది. విధి విధానాలను, మార్గదర్శకాలను మరోసారి జారీ చేసింది. భారతదేశ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా, ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021లో సూచించబడిన నీతి నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
Ministry of Broadcasting Strong Warning to OTT..
ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తలు (OTT ప్లాట్‌ఫారమ్‌లు), స్వీయ-నియంత్రణ సంస్థలు రూల్స్ పాటించాలని ఆదేశించింది. ఈ మధ్య పాపులారిటీ కోసం అడ్డగోలుగా ప్రోగ్రామ్స్ , షోస్, వెబ్ సీరీస్ , సీరియల్స్ స్ట్రీమింగ్ కావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది.
కంటెంట్ సృష్టికర్త రణవీర్ అల్లాబాడియాకు సంబంధించిన వివాదం ఇటీవల ఎంఐబీ కార్యదర్శి సంజయ్ జాజు హాజరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కమ్యూనికేషన్లపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి.
ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్లాట్ ఫారమ్ లు , సోషల్ మీడియాకు సంబంధించి కొంతమంది ప్రచురణకర్తలు ప్రచురించిన అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ వ్యాప్తికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
Also Read : Delhi New CM-Rekha Gupta Popular :హస్తిన సీఎంగా కొలువు తీరిన రేఖా గుప్తా