Megha Akash : మేఘా ఆకాష్ కొత్త మూవీకి ఓకే

స‌హ‌కుటుంబం చిత్రానికి సంత‌కం

టాలీవుడ్ లో న‌టి మేఘా ఆకాష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మ‌డు కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. ఆ మూవీ స‌హ‌కుటుంబం. ఇందు కోసం సంత‌కం కూడా చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా న‌టి ధ్రువీక‌రించింది.

ఈ చిత్రంలో మేఘా ఆకాష్ సిరి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొంది. ఈ యంగ్ బ్యూటీ తెలుగులో లై చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. బ్యాట్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎంద‌రో హీరోయిన్లు ఉన్నా టాప్ లో కొన‌సాగుతున్నారు శ్రీ‌లీల‌. ఆమె చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. ఇక ఆమె ధాటిని త‌ట్టుకుని మేఘా ఆకాష్ కొత్త మూవీకి ఓకే చెప్ప‌డం విశేషం.

మ‌ను చ‌రిత్ర మూవీలో చివ‌రి సారిగా క‌నిపించింది ఈ ముద్దుగుమ్మ‌. రాం కిర‌ణ్ , మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఇవాళ చిత్రానికి సంబంధించి ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌హ కుటుంబం చూసే విధంగా సినిమా ఉండ‌బోతోంద‌ని పేర్కొంది మేఘా ఆకాష్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com