Megha Akash : విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ‘మళై పిడిక్కాద మనిదన్’ (తెలుగులో తుఫాన్) చిత్రంలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, ఇది తన సినీ కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాష్ అభిప్రాయ పడింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా విజయ్ మిల్టన్ రూపొందించే సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఈ సినిమాకు నన్ను సంప్రదించకముందే, స్టోరీ వినకముందే నా మనసులో ఒక బలమైన ముద్ర పడింది. ఖచ్చితంగా ఈ సినిమాల్లో నా పాత్ర బాగా ఉంటుందని ఊహించాను.
Megha Akash Comment
నేను అనుకున్నట్టుగానే సినిమాలో మంచి పాత్ర లభించింది. ప్రతిభ నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ మొత్తం మరిచిపోలేని ఎన్నో అనుభూతులు మిగిలాయి. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Also Read : Dune 2 OTT : ఓటీటీలోకి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్