Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ నటుడు బ్రహ్మానందం, తనయుడు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మ ఆనందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తనకు మనవరాలు ఉందని, ఇంట్లో అందరూ ఆడవాళ్లే ఉన్నారని , తనకు తక్షణమే ఓ మనవడు కావాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు. దీంతో అక్కడున్న వారంతా రామ్ చరణ్, ఉపాసన వైపు చూశారు.
Chiranjeevi Comments
వారిద్దరికీ ఓ పాప పుట్టింది. ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. ఇది ఏకంగా ఆస్కార్ అవార్డు స్వంతం చేసుకుంది. నాటు నాటు అనే పాటకు స్వర పరిచిన ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్ కు ఇది దక్కింది.
ఇదిలా ఉండగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ నేను ప్రస్తుతం లేడిస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తన కుటుంబ వంశ పారంపర్యతను కొనసాగించేందుకైనా తనకు మనవడు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాలు నా చుట్టూ ఉన్నట్టు అనిపించదు. మహిళల మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి చరణ్ కు ఓ పండంటి బిడ్డ కావాలని ఉంది. కానీ తన కూతురు తనను కంటికి రెప్పలా చూసుకుంటోందంటూ పేర్కొన్నాడు.
తనకు మరో ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందన్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ , ఉపాసనకు 2024 జూన్ లో క్లిన్ కారా అనే బిడ్డను కన్నారు. చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు. శ్రీజ కొణిదల, సుష్మిత కొణిదల. శ్రీజకు ఇద్దరు కూతుళ్లు నవిక్ష, నివ్రతి. సుష్మితకు ఇద్దరు కూతు్లు సమార, సంహిత.
చిరంజీవి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read : Hero Ajith-Vidaamuyarchi :అజిత్ విదాముయార్చి కలెక్షన్ల సునామీ