Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డుల పేర్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం… గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించింది. ఈ పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సినీ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ భూషణ్ పుర్కస్కారం అందజేసింది. కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన తాజాగా భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Megastar Chiranjeevi Got Padma Award
భారత గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా… సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీ, హోర్ముస్జీ ఎన్.కామా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినీ రంగానికి చెందిన పలువురు ఎంపిక అయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), వైజయంతీమాల బాలి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికవగా… మరణానంతరం కెప్టెన్ విజయ్‌కాంత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. ప్రముఖ బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ పాప్ సింగర్ ఉషా ఉతప్ అయ్యర్, ప్రముఖ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. గురువారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ ఏడాది అవార్డులను ప్రకటించారు.
ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా… వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి… మిగతా వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : Allu Arjun: పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ప్రకటించిన అల్లు అర్జున్ !