Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవికు మరో అరుదైన గౌరవం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో… దేశంలో రెండో అత్యున్నత పౌర పురష్కారం పద్మ విభూషణ్ చిరంజీవిని వరించింది. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ భూషణ్ పుర్కస్కారం అందజేసింది. కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన తాజాగా భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్(Padma Vibhushan) పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ ఏడాది అవార్డులను ప్రకటించారు. త్వరలో నిర్వహించబోయే పద్మ పురస్కారాల ప్రధానోత్సవంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు.
Padma Vibhushan – పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంపై చిరంజీవి ఎమెషనల్ వీడియో
కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ విభూషన్ అవార్డు ప్రకటించడంపై మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా దేశంలో రెండో అత్యుత్నత పురష్కారం తనకు ప్రకటించడం… అది మెగా అభిమానులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…. ‘కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్(Padma Vibhushan) ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని ఆ వీడియోలో చెప్పారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్‌కు అభినందనలు తెలుపుతూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు.
మెగాస్టార్ కు తన పెద్ద కోడలు ఉపాసన స్పెషల్ విషెస్ !
మెగాస్టార్ చిరంజీవికు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు. మరోవైపు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుండి మెగాస్టార్ చిరంజీవికు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Vishal Rathnam Movie : రిలీజ్ కి సిద్దమైన విశాల్ ‘రత్నం’ సినిమా