Megastar : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ తీసిన పుష్ప2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నేటికీ సూపర్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ఊహించని విధంగా అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది పుష్ప2 . సుకుమార్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు బన్నీతో. పుష్ప రాజ్ అగైన్ అంటూ చెప్పి మరీ సక్సెస్ సాధించాడు.
Megastar Chiranjeevi Comment
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లవ్లీ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్లకు పైగా పుష్ప2 వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar) స్పందించారు. బన్నీ నటన అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. అంతే కాదు పుష్ప2 ఘన విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ మరిన్ని సినిమాలతో అలరిస్తాడని, ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు. ఇప్పుడు తను పాన్ ఇండియా హీరోగా మారి పోయాడని, తను నటించిన తీరు, పలికించిన హావ భావాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు. ఈ సందర్భంగా సృజనాత్మకతకు పెట్టింది పేరైన సుకుమార్ ను ప్రత్యేకంగా ప్రశంసించాడు చిరంజీవి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read: Janhvi Kapoor Vs Andrea Jeremiah