Megastar Chiranjeevi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిసారు. ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుండి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్… బుధవారం ఢిల్లీలోని ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తన భార్య అన్నా లెజినోవా, అకీరా నందన్ తో కలిసి ప్రధాని మోదీను కలిసారు. అక్కడ నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్… తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా చిరంజీవికి పాదాభివందనం చేసారు. అనంతరం అతని తల్లి అజంనాదేవికి కూడా పాదాభివందనం చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Megastar ChiranjeeMegastar Chiranjeevi
చిరు నివాసానికి వచ్చిన పవన్‌కు ఘన స్వాగతం లభించింది. తల్లి అంజనాదేవి పవన్, అన్నాలెజినోవా, అకీరాలకు గుమ్మడికాయతో దిష్టి తీయగా, పవన్ వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. చిరంజీవి(Megastar Chiranjeevi) రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్ పైకి లేపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పైకి ఎగిరి మరీ చిరు పూలదండ వేయగా మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివెరిశాయి. ఈ సందర్భంగా ‘కల్యాణ్‌బాబు హ్యాట్సాఫ్’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి పవన్ తన కుటుంబ సభ్యులకు తినిపించారు.
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించిన జనసేన పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేన పార్టీను పదేళ్ళ క్రితం స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీను ముందుండి నడిపించారు.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్