Megastar : మెగాస్టార్ చిరంజీవి సంచలనంగా మారారు. ఏజ్ పెరిగే కొద్దీ ఆయన మరింత యువకుడిగా మారుతున్నారు. తను ప్రస్తుతం విశ్వంభర మూవీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పూర్తయ్యే దశక వచ్చింది. దీంతో కొత్త మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో కలిసి తీసిన సంక్రాంతికి వస్తున్నాం ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ వర్గాలను సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 330 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత తన తదుపరి చిత్రం మెగాస్టార్ తో ఉంటుందని ప్రకటించాడు.
Megastar Chiranjeevi gives Crazy update
దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి(Megastar). కథ వినడం పూర్తయ్యిందన్నాడు. త్వరలోనే అనిల్ తో ఉంటుందని ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఇందుకు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. ఇది పూర్తిగా వినోదాత్మకంగా, పక్కా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని స్పష్టం చేశారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చే నెల ఏప్రిల్ తొలి వారంలో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి పూజా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేశారని జోరుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారని, ఇందులో కీలకమైన పాత్రలో ఓ సీనియర్ నటి కూడా కన్ ఫర్మ్ అయ్యిందని అందుకే చిరంజీవి ఓకే చెప్పినట్లు టాక్. కాగా ఓటీవల ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడితో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి కథ చెబుతుంటే తనకు ఆనాడు కోదండ రామి రెడ్డితో చేసిన మూవీ గుర్తుకు వచ్చేలా చేసిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుందన్న మాట. ఏది ఏమైనా చిరంజీవి కామెడీని పండించడంలో తనకు తనే సాటి.
Also Read : Beauty Sreeleela : ఆ మూవీ బ్లాక్ బస్టర్ పక్కా