Mega Star: చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు

చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు

Hellotelugu-Mega Star Chiranjeevi

చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు

Mega Star: మొదటి సినిమా ‘బింబిసార’ తో ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ చిరంజీవి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వశిష్ఠ. యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో Mega 156 వర్కింగ్ టైటిల్ తో తాను సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. కొత్త జానర్ లో సోషియో ఫాంటసీ చిత్రంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసారు. ఇటీవల రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు వశిష్ఠ… ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ సినిమాకు సంబందించిన కీలక అంశాలను వెల్లడించారు.

Mega Star – 70 శాతం స్పెషల్ ఎపెక్ట్ తో కొత్త ప్రపంచం సృష్టిస్తున్న దర్శకుడు

జగదేకవీరుడు-అతిలోక సుందరి, అంజి తరువాత చిరంజీవి చేస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను వర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పంచభూతాలు, త్రిశూల శక్తికి ఆధ్యాత్మికతను జోడిస్తూ సాగే ఈ శాతం స్పెషల్ ఎఫెక్ట్ లు ఉంటాయని… అవి సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేస్తున్నారు.

రెండో సినిమాతోనే మెగాస్టార్ ను దర్శకత్వం చేసే అవకాశం

‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా సమయంలో నేను స్కూల్లో చదువుతున్నా. ఆ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. మెగాస్టార్‌(Mega Star) అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. మధ్యలో ‘అంజి’ సినిమా వచ్చినప్పటికీ… అది పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రంగా రూపొందించలేదు. కాబట్టి ఈ సినిమాను పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందిస్తున్నట్లు దర్శకుడు వశిష్ఠ తెలిపారు. నా రెండో సినిమానే చిరంజీవితో తీస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ఆయన ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు.

 

యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యం.యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్‌ కనిపించనున్నారనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

Also Read : Raviteja-Gopichand: గోపీచంద్-రవితేజ కొత్త సినిమా షురూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com