వయసు పెరిగే కొద్దీ ఏ మాత్రం దూకుడు తగ్గించడం లేదు మెగాస్టార్ చిరంజీవి. ఓ వైపు మేనల్లుడు బన్నీ ఇంకో వైపు తనయుడు రామ్ చరణ్ , తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పోటీ పడి నటిస్తున్నారు. సక్సెస్ వస్తుందా రాదా అన్న దానిని ఆయన పట్టించు కోవడం లేదు.
పాలిటిక్స్ లోకి వెళ్లి తిరిగి సినిమా రంగమే బెటర్ అనే భావనలో ఉన్న చిరంజీవి ఇప్పుడు మరోసారి తన సత్తా ఏపాటిదో చూపించేందుకు రెడీగా ఉన్నారు. మెగాస్టార్ నటించిన భోళా శంకర్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. భారీ నష్టం వచ్చినా చిరంజీవికి సినీ మార్కెట్ లో డిమాండ్ మరింత పెరుగుతోందే తప్పా ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఆయన కళ్యాణ్ రామ్ తో సినిమా చేసి బిగ్ సక్సెస్ కొట్టిన దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పేరు ఖరారు చేయక పోయినా ప్రస్తుతానికి మెగా 157 అని పేరు పెట్టారు. దర్శకుడి పనితనం ఏమిటో తెరపై కనిపిస్తుందని ఈ సందర్బంగా మెగాస్టార్ పేర్కొన్నారు.
తలైవా రజనీకాంత్ కు జైలర్..కమల్ హాసన్ కు విక్రమ్ ..చిరంజీవికి మెగా 157 అవుతుందని కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. కంటెంట్ ఉన్నోడికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు కదూ.