Meetha Raghunath: దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఒకరి తరువాత మరొకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి పీటలెక్కేస్తున్నారు. లావణ్య త్రిపాఠీ, కార్తీక నాయర్, రకుల్ ప్రీత్ సింగ్, మీరా చోప్రా, కృతి కర్భంధా ఇప్పటికే పెళ్ళి తంతు పూర్తి చేసుకోగా… వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ చేరిపోయింది. గతేడాది విడుదలైన ‘గుడ్ నైట్’ సినిమాతో మీతా రఘునాథ్… కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. తన క్యూట్ యాక్టింగ్ తో కుర్రాళ్ల ఫేవరెట్ అయిన మీతా రఘునాద్… ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి పీటలెక్కేసింది.
Meetha Raghunath Marriage Updates
కోలీవుడ్ లో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్(Meetha Raghunath)… గతేడాది ‘గుడ్ నైట్’ చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు ‘ముదల్ నీ ముదువమ్ నీ’ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్‌కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీనితో కుర్రాళ్లు… తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా… తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read : Prithviraj Sukumaran: సినిమాలో పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గిన పృథ్వీరాజ్ సుకుమారన్ !