Meenakshi Chaudhary : తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మీనాక్షి చౌదరి

వెంకటేశ్‌ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీ...

Hello Telugu - Meenakshi Chaudhary

Meenakshi Chaudhary : ‘చిత్రపరిశ్రమలో నా ప్రయాణం ఓ కలలా ఉంది. నన్ను నమ్మి మంచి పాత్రలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు హీరోయిన్‌ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఆమె ఓ కథానాయికగా నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం మీనాక్షి మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

Meenakshi Chaudhary Comment

గతేడాది సంక్రాంతికి నేను నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరోసారి పండుగకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తొలిసారిగా ఈ సినిమాలో కామెడీ జానర్‌ ట్రై చేశా. కామెడీ స్పేస్‌ కలిగిన పోలీస్‌ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్‌. అందుకే ఆఫీసర్‌ బాడీ లాంగ్వేజ్‌ పై అవగాహన ఉంది. పోలీస్‌ పాత్ర చేయాలనేది నా కల. కెరీర్‌ ప్రారంభంలోనే ఆ అవకాశం రావడం లక్కీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్లూ చేశాను. వాటిని చూసి జనం ఎంజాయ్‌ చేస్తారు.

వెంకటేశ్‌ అద్భుతమైన వ్యక్తి. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీ. ఆయన ముఖంలో ఎప్పుడూ ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతం. అనిల్‌, వెంకీలది సూపర్‌ కాంబినేషన్‌. అన్ని సీన్లూ అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు అనిల్‌ రావిపూడి కామెడీ టైమింగ్‌ ఫెంటాస్టిక్‌. సీన్‌ను పండించడంలో ఆయన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. కామెడీ పాత్ర చేయడం నాకు తొలిసారే అయినా అనిల్‌ ఎంతో ఓపికగా ప్రతి సీన్‌ వివరించేవారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్టే అయినా కామెడీది మేజర్‌ పార్ట్‌. అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్త సంవత్సరం కూడా ఆశాజనకంగానే ఉంటుందని ఆనుకుంటున్నాను. నవీన్‌ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి. నిర్మాతలే వాటిని ప్రకటిస్తారు.

Also Read : Hero Akhil : అక్కినేని అఖిల్ సినిమా కోసం బాలీవుడ్ విలనా..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com