Meenakshi Chaudhary : నేను ప్లానింగ్ ప్రకారమే ప్రాజెక్టులు చేస్తాను

'గుంటూరు కారం' తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా కావడం నాకు సంతోషంగా ఉంది...

Hello Telugu - Meenakshi Chaudhary

Meenakshi Chaudhary : “ఫలానా పాత్రే చేయాలి… నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే రూల్‌ పెట్టుకోలేదు. మంచి సినిమాలో భాగం కావాలి. దక్కిన పాత్రకు న్యాయం చేయాలంతే ఇదే మొదటి నుంచి నేను ఫాలో అయ్యేది. ఇందులో మిడిల్‌ క్లాస్‌ మదర్‌గా నటించా. సవాల్‌ విసిరిన పాత్ర ఇది. ఇందులో పోషించిన సుమతి పాత్ర గుర్తుండి పోతుంది’’ అని మీనాక్షీ చౌదురి అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌(Lucky Bhaskar)’. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మించారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి మీనాక్షి(Meenakshi Chaudhary) మాట్లాడారు.

Meenakshi Chaudhary Comments

‘గుంటూరు కారం’ తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా కావడం నాకు సంతోషంగా ఉంది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్(Lucky Bhaskar) చేయడం అనేది మంచి అనుభూతి. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బందిపడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

ఇదొక కామన్ మ్యాన్ కథ. డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.

‘మంచి టీంతో పని చేయాలి మంచి కథలు ఎంచుకోవాలి’ ఇదే మొదటి నుంచి నా ఆలోచన వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను. బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్ లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి గారు ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. ట్రైలర్ అవచాకా సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దానికి తగ్గితే సినిమా ఉంటుంది. సాంకేతిక విభాగం అద్భుతంగా పనిచేసి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. జి.వి. ప్రకాష్ గారు సంగీతం చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ప్రతిదీ అద్భుతంగా ఉంటాయి.

దుల్కర్ ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. భాస్కర్ పాత్రకు ఏం కావాలో అది చేసి, కథని భుజాలపై నడిపించారు. అలాగే తెలుగు మాతృభాష కానప్పటికీ, సంభాషణలు నేర్చుకొని చక్కగా చెప్పారు. మమ్మూట్టి గారి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, తనదైన నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతారు దుల్కర్ గారు. భాస్కర్ పాత్రలో కూడా అలాగే ఒదిగిపోయారు. ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి గారి సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Also Read : Trisha Krishnan : త్రిష సిగ్నల్ కోసం ఒక ప్రాజెక్ట్ వైటింగా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com