Meena: సీనియర్ హీరోతో సినిమాకు నో చెప్పిన మీనా ?

సీనియర్ హీరోతో సినిమాకు నో చెప్పిన మీనా ?

Hello Telugu - Meena

Meena: కోలీవుడ్‌ లో రెండు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోగా కొనసాగిన సీనియర్‌ నటుడు రామరాజన్‌… 2001 వరకు వరుసగా సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత పెద్దగా వెండితెరపై కనిపించలేదు. 2010లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రామరాజన్‌ బయటిప్రపంచానికి కూడా టచ్‌లో లేకుండాపోయారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. రామరాజన్ ప్రధాన పాత్రలో ‘సామానియన్‌’ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 63ఏళ్లు కాగా ఆయన సరసన నటించడానికి ఓ సీనియర్ నటి నో చెప్పినట్లు సమాచారం. దీనితో ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Meena Comment

‘సామానియన్‌’ సినిమాలో రామరాజన్‌ లాయర్‌గా నటిస్తున్నారు. దీనితో తన సరసన సీనియర్‌ హీరోయిన్‌ ‘మీనా(Meena)’ అయితే బాగుంటుందని దర్శకుడు ఆర్‌. రాకేష్‌ ద్వారా ఆమెను సంప్రదించారట. అందుకు మీనా అంగీకరించలేదట. కొన్ని కారణాల వల్ల రామరాజన్‌ సినిమాలో నటించలేనని మీనా తెలిపిందని అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీనితో 63 ఏళ్ళ సీనియర్ నటుడుకి మీనా నో చెప్పిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రజనీ-కమల్ లాంటి హీరోలను ఢీ కొట్టిన నటుడు రామరాజన్‌. అలాంటి హీరోతో నటించనని మీనా చెప్పడం ఏంటి..? అంటూ ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అదే రజనీకాంత్‌ సినిమాలో మీనాకు ఛాన్స్‌ వస్తే వదులుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామరాజన్‌ తన 18వ సినిమా ‘కరగట్టకరణ్’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇది 25 కేంద్రాలలో 100 రోజులు, ఎనిమిది కేంద్రాలలో 360రోజులు, నాలుగు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శించబడింది. అలా ఆయన 45 సినిమాల్లో హీరోగా నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ 23 ఏళ్ల తర్వాత ‘సామానియన్‌’ చిత్రం కోసం పనిచేస్తున్నారు. 1998లో తిరుచెందూర్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామరాజన్‌ భారీ మెజరాటీతో గెలిచి ఎంపీగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నారు.

Also Read : Vidya Balan: అన్ లక్కీ ట్యాగ్‌ వల్ల 12 సినిమాలు చేజారిపోయాయి – విద్యాబాలన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com