Mazaka : టైమింగ్..టేకింగ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన మజాకా(Mazaka) కెవ్వు కేక అనిపించేలా ఉంది. ప్రేక్షకుల ముందుకు మహా శివ రాత్రి పండుగ సందర్బంగా వచ్చింది. గతంలో నేను లోకల్, ధమాకా సినిమాలతో బిగ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్. పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
Mazaka Movie Updates
ఇది వర్కవుట్ అయ్యింది. ప్రేక్షకులు ఎక్కువగా కామెడీని కోరుకుంటున్నారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. సోషల్ మీడియాలో పూర్తిగా మజాకా సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా నిర్మాతలకు ఇక పండగేనని చెప్పక తప్పదు. చాన్నాళ్ల తర్వాత మన్మథుడు మూవీలో నటించిన అన్షు మజాకా మూవీలో తళుక్కున మెరిసింది.
ప్రత్యేకించి డైలాగులు పేలాయి. సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రీ కొడుకులుగా ఇరగదీశారు. అద్భుతంగా నటించారు. రీతూ వర్మ కీలక పాత్రలో నటించింది. సందీప్ కిషన్ కు ఈ చిత్రం ఊరటనివ్వగా సినిమాకు సంబంధించి రావు రమేష్ మాటలతో మ్యాజిక్ చేశాడు. కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు నటీ నటులు. తమకు ఇచ్చిన పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. దీంతో ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా మజాకాను తీశాడు దర్శకుడు.
సినిమా టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా సినిమా ఫుల్ లెంగ్త్ మూవీగా ఎంటర్ టైన్ చేయడం ఖాయం.
Also Read : Maha Shivratri Srisailam Shocking :పోటెత్తిన భక్తజనం శివ నామ స్మరణం