Matka Movie : మట్కా సినిమా డైరెక్షన్ లో ‘పా రంజిత్’ సపోర్ట్

ఇక ఈ ట్రైలర్‌పై అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ట్రైలర్‌ ఎక్స్‌లెంట్‌గా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు...

Hello Telugu - Matka Movie

Matka : మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా డైరెక్టర్ కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మట్కా(Matka)’ . మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. నవంబరు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. మరోవైపు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ‘పా రంజిత్’ మట్కా సినిమాకి తన మద్దతు తెలిపారు.

Matka Movie Support..

కబాలి, కాలా, సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి సెన్సేషనల్ సినిమాలతో కోలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసిన డైరెక్టర్ ‘పా రంజిత్’. ఇక పా రంజిత్ అన్ని సినిమాలకి డీఓపీ గా పని చేసిన టాలెంటెడ్ టెక్నీషియన్ కిషోర్ కుమార్ ‘మట్కా(Matka)’ సినిమాతో తెలుగులో డెబ్యూ చేయనున్నారు. మరోవైపు డైరెక్టర్ కరుణ కుమార్ సాహిత్య అభిరుచి ‘పా రంజిత్’ సిద్ధాంతాలతో మ్యాచ్ కావడంతో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పరస్పర గౌరవం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయితున్న ఈ చిత్రానికి ‘పా రంజిత్’ తన ‘X’ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టి మద్దతు తెలిపారు.

ఇక ఈ ట్రైలర్‌పై అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ట్రైలర్‌ ఎక్స్‌లెంట్‌గా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. వరుణ్‌తేజ్‌కు, టీమ్‌కు అభినందనలు తెలిపారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా మాట్లాడారు. ‘‘ ఇంటెన్సిఫైడ్‌ ట్రైలర్‌. వరుణ్‌.. నువ్వు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నావు. నటుడిగా నీలోని కొత్త యాంగిల్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కంగ్రాట్స్‌ కరుణ కుమార్‌. టీమ్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. ‘‘ వరుణ్‌ బాబు.. కిల్లర్‌ ట్రైలర్‌.. నువ్వు అద్భుతంగా ఉన్నావు. తన అతిపెద్ద గ్యాంబ్లింగ్‌తో తప్పకుండా అందరిని అలరిస్తాడని నమ్ముతున్నా. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’’ అని సాయిదుర్గ తేజ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read : Samantha : ఇకపై అలాంటి సాంగ్స్ చేయనంటున్న సమంత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com