Maruthi Nagar Subramanyam: రావు రమేష్‌ ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ ట్రైలర్‌ రిలీజ్ !

రావు రమేష్‌ ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ ట్రైలర్‌ రిలీజ్ !

Hello Telugu - Maruthi Nagar Subramanyam

Maruthi Nagar Subramanyam: విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం(Maruthi Nagar Subramanyam)’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 23న విడుదల కానుంది. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది.

Maruthi Nagar Subramanyam Movie Updates

ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అలాగే ఎనర్జీని ఇస్తుందని తెలుపుతూ… రామ్ చరణ్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… మారుతి నగర్ వాసి సుబ్రహ్మణ్యానికి ఎటకారం ఎక్కువ. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి ‘పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది’ అని అడిగితే… ‘గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను’ అని చెప్పడం చూస్తుంటే.. ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌ తో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా… ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. భర్త సిగరెట్లకు భార్య డబ్బులు ఇస్తోందని ‘ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను’ అని ఇంద్రజ డైలాగ్ చెప్పడం.. ఆ వెంటనే ‘నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే… దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు’ అని అన్నపూర్ణమ్మ చెప్పారు. ఆవిడ రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు.

సుబ్రమణ్యం కుమారుడు ఏమో ‘మా నాన్న అల్లు అరవింద్’ అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేశాడు. ఈ వైవిద్యమైన తండ్రీకొడుకులు అసలేం చేశారు? ఈ కుటుంబ కథ ఏమిటి? అనేది తెలియాలంటే ఆగస్టు 23న థియేటర్లలో ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే అనేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఈ ట్రైలర్ చూసి నవ్వకుండా ఉండలేరంటే.. ఏ రేంజ్‌లో రావు రమేష్(Rao Ramesh) తన నటనా పటిమను కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే థియేటర్స్‌లో నవ్వులు పూయడం కాయం.

ఇందులోని కంటెంట్ ఒక ఎత్తు అయితే… రావు రమేష్(Rao Ramesh) నటన మరొక ఎత్తు అనేలా ట్రైలర్ తెలియజేస్తుంది. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో ఆయన జీవించారు. ‘అవన్నీ ఓకే’ అని డైలాగ్ చెప్పడంలో, నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి గ్లామర్ సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగులు బావున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లలో చూస్తామా అనేంత ఇంపాక్ట్‌ని ఈ ట్రైలర్‌ కలిగిస్తోంది.

Also Read : Buddy: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ సినిమా టిక్కెట్స్ రేట్స్ తగ్గించిన మేకర్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com