Mansoor Ali Khan: మన్సూర్‌ కు మరో ఎదురుదెబ్బ

మన్సూర్‌ కు మరో ఎదురుదెబ్బ... జరిమానా విధించిన మద్రాస్‌ హైకోర్టు

Hello Telugu -Mansoor Ali Khan

Mansoor Ali Khan: నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కు మద్రాస్‌ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై ఆయన వేసిన పరువు నష్టం కేసును శుక్రవారం న్యాయస్థానం కొట్టివేయడంతో పాటు ఫేమ్‌ పొందడం కోసమే మన్సూర్‌ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్ కు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ జరిమానా సొమ్మును అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఆ డబ్బును అందజేయాలని ఆదేశించింది.

Mansoor Ali Khan – అసలేం జరిగిందంటే !

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘లియో’. ఈ సినిమాలో నటించిన మన్సూర్‌ ఆలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని… ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందనుకున్నానని… అయితే ఆ సన్నివేశం లేకపోవడం తనని బాధించిందన్నారు’. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జాతీయ మహిళా హక్కుల కమీషన్ సీరియస్ కావడంతో పాటు మన్సూర్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

మరోవైపు మన్సూర్(Mansoor Ali Khan) వ్యాఖ్యలను ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తో పాటు చిరంజీవి, ఖుష్బూ, రాధిక, గాయని చిన్మయి తదితరులు వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు క్షమాపణ చెప్పేవరకు నిషేధం విధిస్తున్నట్లు నడిగర్ సంఘం ప్రకటించడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో మన్సూర్, సామాజిక మాధ్యమాల వేదికగా త్రిషకు క్షమాపణ తెలిపారు. అయితే చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందంటూ మద్రాస్ హై కోర్టులో కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేసాడు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు… త్రిష, చిరంజీవి , ఖుష్బూల‌పై వేసిన డిఫ‌మెష‌న్ కేసును కొట్టి వేసి మ‌న్సూర్ అలీఖాన్ కు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పున‌ను వెలువ‌రించింది. అంతేకాదు ఆ డ‌బ్బుల‌ను రెండు వారాల్లోగా అడ‌యార్ క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌లో చెల్లించాలని స్ప‌ష్టం చేసింది.

Also Read : RGV Vyuham: ‘వ్యూహం’ సినిమాపై నారా లోకేశ్‌ పిటిషన్‌

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com