Manisha Rani: తండ్రికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ మనీషా !

తండ్రికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ మనీషా !

Hello Telugu - Manisha Rani

Manisha Rani: సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, డ్యాన్సర్‌ మనీషారాణి(Manisha Rani) బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీ బిగ్‌బాస్‌… ఓటీటీ రెండో సీజన్‌ లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత డ్యాన్స్‌ రియాలిటీ షో ఝలక్‌ దిక్‌లాజా 11వ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా పాల్గొని ఏకంగా ట్రోఫీ అందుకుంది. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లోనూ కనిపించి కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తండ్రికి ఊహించని బహుమతిచ్చింది.

Manisha Rani Car

తన తండ్రికి మహీంద్రా కారు కొనిచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో తన తండ్రికి కొత్త కారు తాళాన్ని అందిస్తూమురిసిపోయింది. మా నాన్న కొత్త కారు. ఆయన కోరిక నెరవేర్చుతూ కారు గిఫ్ట్‌గా ఒచ్చాను. ఆయన కన్న కలలన్నీ తనవి మాత్రమే కావు, నావి కూడా. అవన్నీ నెరవేరుస్తాను అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీని ధర దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ వీడియో చూసిన అభిమానులు… నిన్ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నీలాంటి కూతురు ఉండాలి, మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి కష్టంతో పైకి ఎదిగి తండ్రి కలల్ని నెరవేరుస్తుంటే అంతకన్నా ఇన్‌స్పిరేషన్‌ ఇంకేముంటుంది? మధ్యతరగతి నుంచి వచ్చే అమ్మాయిలకు నువ్వొక రోల్‌ మోడల్‌.. అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.

Also Read : Indian 2: సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘భారతీయుడు2’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com