Manisha Koirala : సినీ రంగం మీద మరిచి పోలేని అద్భుతం మనీషా కొయిరాలా. సృజనాత్మక దర్శకుడు మణిరత్నం తీసిన బొంబాయి ఇప్పటికీ ఎప్పటికీ క్లాసికల్ చిత్రంగా నిలిచి పోతుంది. ఇందులో మనీషా(Manisha Koirala) పోషించిన పాత్ర, నటించిన తీరు కోట్లాది కుర్రకారును తనంటే ఇష్ట పడేలా చేసింది. ఆ తర్వాత తన కెరీర్ లో ఎన్నో మరిచి పోలేని సినిమాలలో నటించింది. మెప్పించింది..గుండెలను మీటింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ప్రేమలో కూడా పడింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇప్పటికీ ఇంకా ఒంటరిగానే ఉంటోంది.
Manisha Koirala Viral
ఎవరూ ఊహించని రీతిలో బాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ క్యాన్సర్ భూతానికి లోనయ్యారు. విచిత్రం ఆ ఇద్దరూ ఒకే సినిమాలో నటించారు. అదే బొంబాయి. హమ్మా హమ్మా అంటూ రెమో ఫెర్నాండేజ్ పాడిన పాట, ఎఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే..దానికి ప్రాణం పోసింది నటి సోనాలి బెంద్రే. ఇది ఇప్పటికీ టాప్ సాంగ్ గా కొనసాగుతోంది.
ఇది పక్కన పెడితే మనీషా కొయిరాలాకు 50 ఏళ్లు దాటాయి. ఏజ్ పెరుగుతున్నా ఇంకా ఏ మాత్రం అందం తగ్గడం లేదు. ఇంకా పెరుగుతూనే ఉంది తన బ్యూటీ. ప్రస్తుతం రియాల్టీ షోలో పాల్గొంటోంది. క్యాన్సర్ ను జయించింది. తోటి మహిళలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. ఆత్మ విశ్వాసమే తనను తాను కోలుకోలునేలా చేసిందని అంటోంది. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది మనీషా కొయిరాలా.
Also Read : Popular Heroine Madhuri Dixit : మాధురీ దీక్షిత్ ఎవర్ గ్రీన్ హీరోయిన్