Mangalavaram: ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మంగళవారం’. ఎన్నో అంచనాల మధ్య నవంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ… క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్ సమయంలో ఈ సినిమా విడుదల చేయడంతో అంతంతమాత్రం కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ పుణ్యమా అంటూ థియేటర్లలో మిస్ అయిన అభిమానులను అలరించేందుకు ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ + హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 26 నుంచి ‘మంగళవారం’ సినిమాస్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనున్నట్లు డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. దీనితో బుధవారం రోజున ‘మంగళవారం(Mangalavaram)’ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mangalavaram – ‘మంగళవారం’ కథేమిటంటే !
మహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున వరుసగా రెండు జంటల ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోడలపై రాసిన రాతల వల్లే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత) మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని బలంగా నమ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శవాలకు పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఊరి జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) అడ్డు చెబుతాడు. అతని మాటకు ఊరు కూడా వంత పాడటంతో మొదటిసారి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది.
కానీ, రెండో జంట చనిపోయినప్పుడు మాత్రం ఊరి వాళ్లను ఎదిరించి మరీ పోస్టుమార్టం చేయిస్తుంది. మరోవైపు ఊరి వాళ్లు గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మరి ఊర్లో జరిగినవి ఆత్మహత్యలా? హత్యలా? ఈ చావుల వెనకున్న లక్ష్యం ఏంటి?వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలు (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆమె కథేంటి? ఊర్లో జరిగే చావులకు ఫొటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమిందారుకు.. అతని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? శైలు చిన్ననాటి ప్రియుడు రవి కథేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు అజయ్ భూపతి.
Also Read : Animal: ఓటీటీలోకి ‘యానిమల్’… కొత్త సీన్లు యాడ్ చేస్తున్న దర్శకుడు