ఆర్ఎక్స్ 100 మూవీతో అందాలను ఆర బోసిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంగళవారం చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
ఈ చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి. గతంలో శర్వానంద్ , సిద్దార్త్ తో కలిసి మహా సముద్రం తీశాడు. అది ఆశించినంత ఆడలేదు. నిరాశను మిగిల్చింది. ఒక ఊరులో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. కానీ ఎందుకు జరుగుతాయో, ఎవరు చేస్తున్నారో తెలుసు కునేందుకు చేసిన ప్రయత్నం ఈ మంగళవారం చిత్రం.
ఇక మూవీకి సంబంధించి చూస్తే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విచిత్రం ఏమిటంటే జాతీయ స్థాయిలో పేరు పొందిన కన్నడ సినిమా కాంతారా చిత్రానికి సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించడం విశేషం.
మంగళవారం సినిమాను స్వాతి రెడ్డి, సురేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మూవీపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు అజయ్ భూపతి. మరి ఏ మేరకు చిత్రాన్ని ఆదరిస్తారో వేచి చూడాలి.