Kannappa : మంచు మోహన్ బాబు సమర్పణలో వస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. చిత్రానికి సంబంధించి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. మంచి స్పందన లభించింది. మూవీ మేకర్స్ ఏప్రిల్ 25న ఆరు నూరైనా సరే కన్నప్ప ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇవాళ చావు కబురు చల్లగా చెప్పారు.
Kannappa Release Updates
కన్నప్ప(Kannappa) మూవీని అనుకున్న సమయానికి తీసుకు రాలేక పోతున్నామని తెలిపారు. కీలక ఎపిసోడ్స్ లో వీఎఫ్ఎక్స్ పూర్తి కాక పోవడంతో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందన్నారు. ఇక ఈ మూవీలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ , మంచు విష్ణు, మోహన్ బాబు, డార్లింగ్ ప్రభాస్ . దీంతో కన్నప్ప మూవీపై బజ్ పెరిగింది. భారీగా అంచనాలు పెరిగాయి.
సినిమా సక్సెస్ కావాలంటే గ్రాఫిక్స్ అత్యంత ముఖ్యం. త్వరలోనే కన్నప్ప మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వస్తుందని ఆశిస్తున్నారు మంచు మోహన్ బాబు అభిమానులు. సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేయాలని డాక్టర్ మంచు మోహన్ బాబు కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also Read : Hero Ram Charan :కళ్లు చెదిరేలా చెర్రీ ఆస్తులు